ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో ఆయనకు కడప మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు నేపథ్యంలో ఆయనపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కడప మొబైల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసినా బయటకు వచ్చే పరిస్థితి లేదు. నరసరావుపేట, ఆదోని కోర్టుల్లో కూడా బెయిల్ వస్తేనే ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది.
ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి నటుడు పోసాని కృష్ణ మురళికి కడప మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నటుడిని కస్టడీలోకి తీసుకోవాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.