మరో సంచలన పోస్టు పెట్టిన పూనమ్

పూనమ్ కౌర్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారు. ఏపీలో జరుగుతున్న రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్న పూనమ్..

By Medi Samrat  Published on  26 Feb 2024 9:33 PM IST
మరో సంచలన పోస్టు పెట్టిన పూనమ్

పూనమ్ కౌర్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారు. ఏపీలో జరుగుతున్న రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్న పూనమ్.. సంచలన పోస్టులు పెడుతూ వస్తుంటారు. ‘ఒకరి జీవితంలో హీరోగా ఉన్నవారు.. మరొకరి జీవితంలో విలన్స్ కావచ్చు. సామూహిక ప్రయోజనం ప్రకారం వారి చుట్టూ నేరేటివ్ సృష్టిస్తారు’ అంటూ ట్వీట్ చేశారు. అయితే.. ఎవరి గురించి ఈ ట్వీట్ పెట్టిందో పూనమ్ చెప్పలేదు.

కొద్దిరోజుల కిందట పూనమ్ త్రివిక్రమ్‌ను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్లు సంచలనం సృష్టించాయి. త్రివిక్రమ్ యూజ్లెస్ ఫెలో అంటూ ఒక ట్వీట్ చేసి కలకలం రేపింది. ఒక వెబ్ న్యూస్ పోర్టల్ పవన్ కళ్యాణ్ స్పీచ్ ని షేర్ చేసింది. అందులో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ గురించి మాట్లాడుతూ త్రివిక్రమ్ ప్రస్తావన తీసుకొచ్చారు. త్రివిక్రమ్ రాసే డైలాగ్స్ ను కూడా తాను పంచ్ డైలాగ్స్ లాగా చెప్పలేనని అన్నారు. అదే వీడియో కింద పూనం కౌర్ త్రివిక్రమ్ యూజ్లెస్ ఫెలో అని కామెంట్ చేశారు. ఇప్పుడు మరో సంచలన పోస్ట్ పెట్టడం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఇంతకూ పూనమ్ చెబుతున్న విలన్ ఎవరో?

Next Story