నటి పూజా హెగ్డే తన కుటుంబంతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో ఉన్న శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి శ్రీ కాళహస్తీశ్వర స్వామి, శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి ప్రత్యేక దర్శనం కల్పించారు.
పూజ హెగ్డే ప్రత్యేక రాహు కేతు పూజలు కూడా చేశారు. ఆలయంలోనే రాహు-కేతు దోష నివారణ పూజలు నిర్వహించారు. గర్భాలయానికి సమీపంలో ఉన్న రాహుకేతు పూజ మండపంలో పూజలు చేయించారు. దర్శన అనంతరం ఆలయ అర్చకులు పూజా హెగ్డేకు ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి, వాయు లింగేశ్వరుని తీర్థప్రసాదాలు అందజేసి, స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేశారు.