అమరావతి: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం బుధవారం నిర్వహించే పాలీసెట్-2025కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు పాలిసెట్ పరీక్ష జరగనుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 500 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష రాసే అభ్యర్థులు తమ వెంట హాల్ టికెట్‌తో పాటు ఒరిజినల్ ఐడెంటిటి కార్డును తీసుకెళ్లాలి.
అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరువాలి. ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. బాల్‌పాయింట్ (బ్లాక్) పెన్ను, హెచ్‌బీ/2బీ పెన్సిల్, ఎరైజర్, షార్పనర్ మాత్రమే వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. ట్యాబ్‌లు, మొబైల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, స్మార్టు వాచ్‌లు వంటివి అనుమతించరు. ఇతర వివరాలకు 9989064100, 9490309037 అనే నెంబర్లలో సంప్రదించాలని కోరారు.