ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి మే13న పోలింగ్ జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. జూన్ 4న ఫలితాలు విడుదలవ్వనున్నాయి. పార్లమెంట్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ అమల్లోకి వచ్చింది. పోటీ చేసే అభ్యర్థులు, పొలిటికల్ పార్టీలు ఎన్నికల సమయంలో ఈసీ మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది.
97 కోట్ల మంది ఓటర్లు రానున్న ఎన్నికల్లో తమ లోక్‌సభ ప్రతినిధిని ఎన్నుకోనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. వీరిలో 1.8 కోట్ల మంది మొదటి సారి ఓటర్లు కాగా, 19.74 కోట్ల మంది ఓటర్లు 20 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్కులేనని ఆయన తెలిపారు.