ఏపీలో కొనసాగుతున్న పరిషత్‌ పోలింగ్‌

Polling for pending parishad elections in ap. ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్‌ పరిషత్‌ పోరు కొనసాగుతోంది. పలు కారణాల వల్ల ఆగిపోయిన 10 జెడ్పీటీసీ స్థానాలకు,

By అంజి  Published on  16 Nov 2021 5:30 AM GMT
ఏపీలో కొనసాగుతున్న పరిషత్‌ పోలింగ్‌

ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్‌ పరిషత్‌ పోరు కొనసాగుతోంది. పలు కారణాల వల్ల ఆగిపోయిన 10 జెడ్పీటీసీ స్థానాలకు, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం అయ్యింది. ఏపీలో పరిషత్‌ ఎన్నికలు కొన్ని నెలల కిందట జరిగాయి. అయితే అప్పుడు పలు కారణాలతో ఆగిపోయిన, విజేతలు చనిపోయిన కారణంగా ఆ స్థానాలకు ఇప్పుడు పోలింగ్‌ జరుగుతోంది. గతంలో పలు చోట్ల పరిషత్‌ ఎన్నికలు జరిగినప్పుడు కౌంటింగ్ సమయంలో ఓట్లు తడిసిపోవడంతో.. ఆ స్థానాలకు మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కడప జిల్లా జమ్మలమడుగు జెడ్పీటీసీ స్థానంలో రెండు బూత్‌లతో పాటు, మరో 6 ఎంపీటీసీ స్థానాల్లో రీ పోల్‌ నిర్వహిస్తున్నారు.

176 ఎంపీటీసీ స్థానాలు, 14 జెడ్పీటీసీ స్థానాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీటిలో 50 ఎంపీటీసీ స్థానాలు, 4 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మరో మూడు ఎంపీటీసీ స్థానాల్లో ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. 954 పోలింగ్‌ బూత్‌లలో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. ఎంపీటీసీ స్థానాల్లో 328 మంది, జెడ్పీటీసీ స్థానాల్లో 40 మంది పోటీలో ఉండగా.. 8,07,640 మంది ఓటర్లు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్‌ ముగిశాక.. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎల్లుండి చేపట్టనున్నారు. పోలింగ్‌ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

Next Story