గుంటూరు కోర్టుకు గోరంట్ల మాధవ్
మాజీ ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్‌ను పోలీసులు గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు.
By Medi Samrat
మాజీ ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్‌ను పోలీసులు గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు. మాధవ్‌ను తొలుత నల్లపాడు పీఎస్ నుంచి గుంటూరు జీజీహెచ్‌కు తరలించిన పోలీసులు అక్కడ వైద్య పరీక్షలు చేయించారు. వైద్య పరీక్షల అనంతరం మాధవ్‌ను కోర్టుకు తీసుకొచ్చారు.
చుట్టుగుంట వద్ద పోలీసు వాహనాన్ని తన అనుచరులతో కలసి మాధవ్ అడ్డుకున్నారని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు కిరణ్‌పై మాధవ్ దాడికి పాల్పడ్డారని, గోరంట్ల మాధవ్ తోపాటు మరో ఐదుగురు దాడిలో పాల్గొన్నారన్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన మాధవ్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేశామన్నారు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్. వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్‌కుమార్‌ను పోలీసులు వాహనంలో గుంటూరు ఎస్పీ కార్యాలయానికి తీసుకొస్తున్నారన్న సమాచారంతో మాధవ్ అడ్డుకోవడానికి ప్రయత్నించారు. కిరణ్‌కుమార్‌పై దాడి చేసేందుకు మాధవ్ యత్నించాడు. తమ విధులకు ఆటంకం కలిగించారనే అభియోగాలపై పోలీసులు మాధవ్‌ను అరెస్టు చేసి నల్లపాడు పీఎస్‌కు తరలించారు.