Dead Body in Parcel : ఆ మృతదేహం ఎవరిదో తెలిసింది

పశ్చిమగోదావరి జిల్లా యండగండి గ్రామంలో పార్శిల్ డెడ్ బాడీ మిస్టరీ వీడింది.

By Medi Samrat  Published on  23 Dec 2024 11:06 AM GMT
Dead Body in Parcel : ఆ మృతదేహం ఎవరిదో తెలిసింది

పశ్చిమగోదావరి జిల్లా యండగండి గ్రామంలో పార్శిల్ డెడ్ బాడీ మిస్టరీ వీడింది. ఈ శవం కాళ్ళ గాంధీనగర్ కు చెందిన పర్లయ్యదిగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో తులసి మరిది శ్రీధర్ వర్మను పోలీసులు నిందితుడిగా అనుమానిస్తున్నారు. పార్శిల్ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి శ్రీధర్ వర్మ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పటికే మూడుపెళ్లిళ్లు చేసుకున్న శ్రీధర్ మూడో భార్యతో పశ్చిమగోదావరి జిల్లా కాళ్ళ గ్రామంలో ఉంటున్నాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు కాళ్ళ గ్రామంలోని శ్రీధర్‌వర్మ ఇంట్లో తనిఖీలు చేశారు. అతడి ఇంట్లో మరో ఖాళీ చెక్క పెట్టె కనిపించింది.

కాళ్ళ గాంధీనగర్‌కు చెందిన పర్లయ్య మద్యానికి బానిసయ్యాడు. అతడ్ని శ్రీధర్ వర్మ పనికి తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో పర్లయ్యను హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. హత్య అనంతరం అతడిని చెక్క పెట్టేలో పెట్టి పార్శిల్ చేశారు

Next Story