టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై పోలీసు కేసు నమోదైంది. నటుడు పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడుకు సంబంధించిన చిత్రాలను మార్ఫింగ్ చేసి కూడా రామ్ గోపాల్ వర్మ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్నారు. తాజాగా రామ్ గోపాల్ వర్మపై పోలీసు కేసు నమోదైంది. పలువురు వైసీపీ కార్యకర్తలపై ఇప్పటికే కేసు నమోదైంది. అనేక మంది అరెస్టులు కూడా జరిగాయి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ పై పోలీసులు దృష్టి పెట్టారు.
మద్దిపాడు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు మేరకు పోలీసులు వర్మపై కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్, నారా బ్రాహ్మణి పైన రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై అప్పట్లో టీడీపీకి చెందిన నేతలు తీవ్ర విమర్శలు చేశారు. సినిమా పేరుతో రామ్‌గోపాల్ వర్మ చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్‌తో పాటు ఆయన భార్య బ్రాహ్మణిని కూడా కించపరిచారని ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.