సీఎం జ‌గ‌న్ పుట్టిన రోజు.. ప్ర‌ధాని స‌హా ప్ర‌ముఖుల విషెస్‌

PM Modi Wishes to CM Jagan on his Birthday.వైఎస్ జ‌గ‌న్ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Dec 2022 1:01 PM IST
సీఎం జ‌గ‌న్ పుట్టిన రోజు.. ప్ర‌ధాని స‌హా ప్ర‌ముఖుల విషెస్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నాయి. ఇదే స‌మ‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స‌హా కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రి, త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్‌ల‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు శుభాకాంక్ష‌లు. ఆయ‌న ఆయురారోగ్యాల‌తో దీర్ఘాయుష్షు పొందాల‌ని ఆకాక్షించారు ప్ర‌ధాని మోదీ.

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు హృద‌య‌పూర్వ‌క న‌మ‌స్కారాలు. 50వ పుట్టిన రోజు సంద‌ర్భంగా మీకు శుభాకాంక్ష‌లు. ఈ ప్ర‌త్యేక‌మైన రోజున మీకు ఎల్ల‌ప్పుడూ శాంతి, మంచి ఆరోగ్యం మరియు ఆనందం క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను - త‌మిళ నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్




Next Story