మే 2న అమరావతిలో ప్రధాని మోడీ పర్యటన
ప్రధాని నరేంద్ర మోడీ మే 2న అమరావతిలో పర్యటించనున్నారని మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik
మే 2న అమరావతిలో ప్రధాని మోడీ పర్యటన
ప్రధాని మోడీ అమరావతి పర్యటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ మే 2న అమరావతిలో పర్యటించనున్నారని మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మోడీ పర్యటన మే 2వ తేదీన ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 3 ఏళ్లలో శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రహదారులు పూర్తి చేయాలని సీఎం వెల్లడించారు.
ఇన్ఛార్జ్ మంత్రుల పర్యటనల్లో 3 పార్టీల నేతల భాగస్వామ్యం ఉండాలని సూచించారు. రెవెన్యూ సంబంధిత అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. రెవెన్యూ సమస్యల్లో పోలీసుల జోక్యం అంశాలను పరిష్కరించాలని తేల్చి చెప్పారు. సూర్యఘర్ పథకం అమలు మరింత వేగం పెంచాలని దిశానిర్దేశం చేశారు.
మనం తీసుకునే రాజకీయ నిర్ణయాల్లో ఎలాంటి గందరగోళం ఉండకూడదు. ప్రజలకు ఏది మంచో అదే నిర్ణయాన్ని మనం తీసుకుంటున్నాం. వైసీపీ వక్ఫ్ బోర్డ్ బిల్లు అంశంలో 3 రకాలుగా వ్యవహరించింది. పార్లమెంట్ లో ఒకలా, రాజ్యసభ లో మరోలా, కోర్టులో మరోలా వైసీపీ వ్యవహరించింది. వైసీపీ రాజకీయ కుట్రలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే, మనం తీసుకున్న నిర్ణయాల్లో ఎలాంటి గందరగోళం లేకుండా చూసుకోవాలి..అని సీఎం మంత్రులకు సూచించారు.