జైలు నుంచి విడుదలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ఎక్కడికి పయనమయ్యారంటే..!

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు

By Medi Samrat  Published on  24 Aug 2024 2:23 PM IST
జైలు నుంచి విడుదలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ఎక్కడికి పయనమయ్యారంటే..!

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈవీఎంను ధ్వంసం చేయడం, పోలీసు అధికారిపై దాడికి యత్నించడం వంటి కేసుల్లో ఆయన సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే తన వాహనంలో ఆయన మాచర్లకు బయల్దేరారు.

శుక్రవారం ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 50 వేల విలువైన రెండు పూచీకత్తులను సమర్పించాలని, పాస్ పోర్టును అప్పగించాలని షరతులు విధించింది. ప్రతి వారం పోలీస్ స్టేషన్ లో సంతకం చేయాలని ఆదేశించింది ధర్మాసనం. జూన్ 26వ తేదీన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టయ్యారు. మే 13వ తేదీన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సమయంలో మాచర్ల అసెంబ్లీ పరిధిలోని పాల్వాయిగేటు 202, 7 నంబర్ పోలింగ్ స్టేషన్లల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పిన్నెల్లి ధ్వంసం చేశారు.

Next Story