మాచర్ల కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి బ్రదర్స్

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది.

By -  Medi Samrat
Published on : 10 Dec 2025 8:10 PM IST

మాచర్ల కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి బ్రదర్స్

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది. రెండు వారాల్లో మాచర్ల కోర్టులో లొంగిపోవాలని నవంబర్ 28న ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలతో పిన్నెల్లి బ్రదర్స్ డిసెంబర్ 11న కోర్టులో లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు.

మే 24న టీడీపీ నేతలు జవిశెట్టి కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు హత్య జరిగింది. ఈ కేసులో పిన్నెలి రామకృష్ణారెడ్డి ఏ6, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని ఏ7గా ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు. ఈ కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో పిన్నెల్లి బ్రదర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ తీర్పును ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ మేరకు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ రద్దు చేసింది. కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది.

Next Story