టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్
ఏపీ ప్రభుత్వం ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యులను నియమించింది.
By Medi Samrat Published on 28 Aug 2023 2:49 PM GMTఏపీ ప్రభుత్వం ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యులను నియమించింది. ఈ నియామకాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. నేరచరిత్ర, లిక్కర్ వ్యాపారాలు చేస్తున్న వారిని టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించడం సరి కాదని చింతా వెంకటేశ్వర్లు హై కోర్టులో పిటిషన్ వేశారు. టీటీడీ బోర్డు సభ్యులుగా ఎన్నికైన ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కేతన్ దేశాయ్, శరత్ చంద్రారెడ్డి నియామకాలను ఆయన సవాల్ చేశారు. ఈ ముగ్గురిని టీటీడీ బోర్డు సభ్యులుగా తొలగించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఇటీవలే భూమన కరుణాకర్ రెడ్డిని ఛైర్మన్ గా నియమించింది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా కొత్త పాలకమండలని ఖరారు చేసింది. ఎమ్మేల్యే కోటాలో పోన్నాడ సతీష్, సామినేని ఉదయభాను, తిప్పేస్వామికి అవకాశం దక్కింది. ఇక తెలంగాణ నుంచి శరత్, బీఆర్ఎస్ ఎంపీ రంజీత్ కుమార్ సతీమణి సీతారెడ్డికి చోటు దక్కింది. కడప నుంచి మాసీమ బాబు,యానదయ్య,కర్నులు నుంచి సీతారామిరెడ్డి,గోదావరి జిల్లా నుంచి సుబ్బారాజు,సిద్దారాఘరావు కుమారుడు సుధీర్,అనంతపురం నుంచి అశ్వథామ నాయక్ పేర్లు ఖరారు అయ్యాయి. మహరాష్ట్ర నుంచి అమోల్ కాలే, సౌరభ్ బోరా,మిలింద్ నర్వేకర్, తమిళనాడు నుంచి డాక్టర్ శంకర్, కృష్ణమూర్తి, కర్నాటక నుంచి దేశ్ పాండే కు అవకాశం కల్పించారు. పాలకమండలి సభ్యుల నియామకాలపై ప్రతి పక్ష నేతలు కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు.