Andhrapradesh: కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్
కానిస్టేబుల్ అభ్యర్థులకు పీఎంటీ/ పీఈటీ ఈవెంట్లు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి.
By అంజి Published on 29 Dec 2024 6:00 PM ISTAndhrapradesh: కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్
అమరావతి: కానిస్టేబుల్ అభ్యర్థులకు పీఎంటీ/ పీఈటీ ఈవెంట్లు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఇవి కొనసాగనున్నాయి. ఈవెంటకు ఎంపికైన వారు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే గడువు ఇవాళ్టితో ముగిసింది. అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 9441450639, 9100203323 నంబర్లను సంప్రదించండి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఈ నంబర్లు కలుస్తాయి.
కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం 2022లో 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. అనంతరం జనవరి 22న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు 4,58,219 మంది హాజరయ్యారు. వారిలో 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఫిబ్రవరి 5న ఈ ఫలితాలు విడుదలయ్యాయి. వీరందరికీ ఆ వెంటనే రెండో దశలో పీఎంటీ, పీఈటీ పరీక్షలు నిర్వహించాలి. గతేడాది మార్చి 13 నుంచి 20వ తేదీ వరకూ నిర్వహిస్తామంటూ మొదట షెడ్యూల్ విడుదల చేసి హాల్‌టికెట్లూ జారీ చేశారు. చివరికి ఎన్నికల సాకుతో దానిని వాయిదా వేశారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం.. కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్ చేబుతూ, నియామక ప్రక్రియ చేపట్టింది.