చంద్రబాబు అరెస్ట్‌పై హరీశ్ రావు వ్యాఖ్య‌లు.. పేర్ని నాని స్పంద‌న‌

సిద్దిపేట్ జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో ఆయిల్ ఫామ్ కర్మగారానికి మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేసిన

By Medi Samrat  Published on  1 Oct 2023 6:23 PM IST
చంద్రబాబు అరెస్ట్‌పై హరీశ్ రావు వ్యాఖ్య‌లు.. పేర్ని నాని స్పంద‌న‌

సిద్దిపేట్ జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో ఆయిల్ ఫామ్ కర్మగారానికి మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేసిన అనంత‌రం మాట్లాడుతూ.. మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ గురించి స్పందించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మాట్లాడుతూ.. చంద్రబాబును ఈ వయసులో అరెస్ట్ చేయడం దురదృష్టకరమన్నారు. ఇది మంచి విషయం కాదన్నారు. ఉమ్మడి పరిపాలనలో వివక్షకు గురైన తెలంగాణ ప్రాంతంలోనే ప్రస్తుతం అత్యధిక భూమి రేట్లు ఉన్నాయని.. చంద్రబాబు నాయుడు అన్న విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల ఆదాయం పెంచి.. రైతుల భూమి విలువ కూడా పెరిగేలా చేశారని హరీశ్ రావు పేర్కొన్నారు.

అయితే.. హ‌రీష్ రావు వ్యాఖ్య‌ల‌పై విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్టీఆర్‌కు జరిగినట్లు కేసీఆర్‌కూ అల్లుడి పోటు తప్పదేమోన‌ని అన్నారు. హరీష్‌రావు చంద్రబాబును అరెస్ట్‌ చేయడం చాలా తప్పు అన్నాడా.? హరీష్‌ రావు కేసీఆర్‌కి అల్లుడు.. చంద్రబాబు రామారావుకి అల్లుడు.. ఈ అల్లులిద్దరూ కలిసి మామలను ఏం చేస్తారో తెలియదా? అని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎన్టీఆర్‌కి ఏం జరిగిందో.. కేసీఆర్‌కు బహుశా అదే జరుగుతుందేమోన‌ని అనుమానం వ్య‌క్తం చేశారు. ఈ అల్లుళ్ల గిల్లుళ్లు మనకు తెలియదా..? ఎన్టీఆర్‌ అమాయకుడు కాబట్టి అలా జరిగిందేమో.. కానీ కేసీఆర్‌ వద్ద హరీష్‌రావు గిల్లుళ్లు సాగవేమో? అని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

Next Story