చిత్తూరులో స్టూడియో ప్రారంభించిన 'పెప్పర్‌ఫ్రై'

Pepperfry Launches Its First Studio In Chittor. భారతదేశపు నెంబర్ వ‌న్‌ ఫర్నిచర్‌, గృహ ఉత్పత్తుల సంస్థ‌ పెప్పర్‌ఫ్రై.. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో తమ మొదటి స్టూడియో

By Medi Samrat  Published on  12 April 2022 6:54 PM IST
చిత్తూరులో స్టూడియో ప్రారంభించిన పెప్పర్‌ఫ్రై

భారతదేశపు నెంబర్ వ‌న్‌ ఫర్నిచర్‌, గృహ ఉత్పత్తుల సంస్థ‌ పెప్పర్‌ఫ్రై.. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో తమ మొదటి స్టూడియో ప్రారంభించినట్లు వెల్లడించింది. భారతదేశంలో ఫర్నిచర్‌, గృహ ఉత్పత్తుల విభాగంలో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న పెప్పర్‌ఫ్రై.. ఆ దిశ‌గా మ‌రో అడుగు ముందుకు వేసింది. 2014లో మొదటి స్టూడియోను పెప్పర్‌ఫ్రై ప్రారంభించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 80కు పైగా నగరాలలో 150కు పైగా స్టూడియోలు సంస్థకు ఉన్నాయి.

ఈ స్టూడియోను బీ అండ్‌ బీ హోమ్‌ స్కేప్‌ భాగస్వామ్యంతో ప్రారంభించారు. చిత్తూరులోని అత్యంత కీలకమైన వాణిజ్య ప్రాంతం కట్టమంచి వద్ద ఇది 720 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇది వినియోగదారులకు ప్రత్యేకంగా ఎంపిక చేసిన శ్రేణి ఫర్నిచర్‌, డెకార్‌ తొలి అనుభవాలను అందిస్తుంది. పెప్పర్‌ ఫ్రై వెబ్‌సైట్‌పై అందుబాటులో ఉన్న ఒక లక్ష ఉత్పత్తుల నుంచి ఎంపిక చేసిన వైవిధ్యమైన ఉత్పత్తుల జాబితాను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.

దక్షిణ భారతదేశం పెప్పర్‌ ఫ్రైకు అతిపెద్ద మార్కెట్‌గా నిలుస్తుంది. ఇక్కడే 50కు పైగా స్టూడియోలు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, మంగళూరు, కొచి, మధురై, వెల్లూరు, సేలం, గుల్బర్గా, చిత్తూరు, చేర్తల, మంగళూరు, ఎరోడ్‌, తిరువల్ల, త్రిచి, కొల్లామ్‌, విజయవాడ, విశాఖపట్నం, కోజికోడ్‌, వరంగల్‌, కొట్టాయం, సికింద్రాబాద్‌ల‌లో సంస్థకు ఉన్నాయి. ఇప్పుడు చిత్తూరులో ప్రారంభ‌మైంది.

ఈ స్టూడియోలు వినియోగదారులకు టచ్‌ అండ్‌ ఫీల్‌ అనుభూతులను అందించడంతో పాటుగా ఉడ్‌ ఫినీషెస్‌ను అర్థం చేసుకోవడం, కొనుగోలు చేయక మునుపే ఈ భారీ వస్తువుల నాణ్యతను తెలుసుకోవడం సాధ్యమవుతుంది. ఈ స్టూడియోలో డిజైన్‌ నిపుణులు కూడా ఉండటం వల్ల.. కాంప్లిమెంటరీ డిజైన్‌ కన్సల్టెన్సీని సైతం అందించవ‌చ్చు. తద్వారా వినియోగదారులు తమ కలల ఇంటిని సృష్టించుకోవచ్చు.

ఈ స్టూడియో ప్రారంభం గురించి పెప్పర్‌ ఫ్రై బిజినెస్‌ హెడ్‌ అమృత గుప్తా మాట్లాడుతూ '' బీ అండ్‌ బీ హోమ్‌స్కేప్‌తో భాగస్వామ్యం చేసుకుని చిత్తూరులో మా మొదటి స్టూడియోను ప్రారంభించడం ద్వారా మా ఓమ్నీ ఛానెల్‌ కార్యకలాపాలను విస్తరించడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నామన్నారు.

బీ అండ్‌ బీ హోమ్‌స్కేప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బాబీ బెనిడిక్ట్‌ సీ మాట్లాడుతూ '' పెప్పర్‌ ఫ్రైతో ఇది మా రెండవ ఫ్రాంచైజీ. భారతదేశంలో సుప్రసిద్ధ హోమ్‌, ఫర్నిచర్‌ మార్కెట్‌ ప్రాంగణంతో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నామన్నారు.

























Next Story