ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీన ఇచ్చే పెన్షన్లను ఒకరోజు ముందుగానే పంపిణీ చేయనుంది. ఈ నేపథ్యంలో నేడు పెన్షన్లు అందజేసేందుకు చర్యలు చేపట్టింది. కొత్త సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే రూ.2,743 కోట్లను విడుదల చేసింది.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా 63 లక్షల మందికి పైగా పెన్షన్ దారులకు నేడు సచివాలయ సిబ్బంది ఇంటి వద్దే పెన్షన్ డబ్బులను అందజేయనున్నారు. ఇవాళ తీసుకోని వారికి జనవరి 2వ తేదీన పంపిణీ చేస్తారు. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ పంపిణీ జరుగుతుంది. కానీ కొత్త సంవత్సరం సందర్భంగా ఏర్పడే సెలవులు, పరిపాలనా సౌలభ్యం కారణంగా ఈసారి జనవరి పెన్షన్‌ను ముందుగానే అందజేస్తున్నారు.