అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు వినిపించింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను విడుదలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీఎం చంద్రబాబ నాయుడు ఆదేశాల మేరకు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు విడుదల కానున్నాయి. ఉద్యోగులకు శుక్రవారం రోజున రూ.6.200 కోట్ల బకాయిలను చెల్లించాలని ఆర్థిక శాఖను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సీపీఎస్, జీపీఎఫ్, ఏపీజీఏఐ కింద కలిపి రూ.6,200 కోట్లు విడుదల చేసేందుకు అధికారులు రెడీ అయ్యారు.
ఆర్థిక పరమైనా ఇబ్బందులు ఉన్నా కూడా.. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. అటు బకాయిల విడుదలపై ఏపీ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. మిగిలిన పెండింగ్ అంశాలపైనా సానుకూలంగా స్పందించాలని కోరింది. కాగా ఈ ఏడాది జనవరి 11న ఉద్యోగులకు వివిధ బకాయిల కింద రూ.1,033 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లింపులు చేస్తుండడంతో ప్రభుత్వ ఉద్యోగలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.