సీఎం జగన్‌పై పవన్ కల్యాణ్ 'అప్పురత్న' సెటైర్లు

Pawan Kalyan's 'Appuratna' satires on CM Jagan. సీఎం జగన్‌పై మరోసారి సెటైర్లు వేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.

By M.S.R  Published on  7 Feb 2023 10:40 AM GMT
సీఎం జగన్‌పై పవన్ కల్యాణ్ అప్పురత్న సెటైర్లు

సీఎం జగన్‌పై మరోసారి సెటైర్లు వేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్. అప్పులతో ఆంధ్ర పేరు మారుమోగిస్తున్నందుకు ప్రత్యేక శుభాకాంక్షలంటూ ట్వీట్‌ చేశారు. మీ వ్యక్తిగత సంపాదనను పెంచుకోవడం మర్చిపోవద్దంటూ ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ను అప్పురత్న అంటూ పవన్‌ చేసిన ట్వీట్లు ఇప్పుడు వైరల్‌ అయ్యాయి. సీఎంను అప్పురత్న అంటూ ఎద్దేవా చేశారు. అప్పులతో దేశ వ్యాప్తంగా ఏపీ పేరును మారుమోగిస్తున్నందుకు జగన్ కు ప్రత్యేక శుభాభినందలు అంటూ ఎద్దేవా చేశారు. ఓ వైపు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతూ, మీ వ్యక్తిగత సంపాదనను పెంచుకోవడం మర్చిపోవద్దు అని చెప్పారు. రాష్ట్ర సంపద, భవిష్యత్తును గాలికొదిలేసి, మీ సంపదను పెంచుకోండని విమర్శించారు.

"అప్పులతో ‘ఆంధ్ర’ పేరు మారుమోగిస్తున్నందుకు,ముఖ్యమంత్రి కి నా ప్రత్యేక శుభకాంక్షలు ..keep it up👍

P.S : Don’t forget to increase your personal wealth.Let the State wealth & progress go to ‘Dogs’ but your personal wealth & assets..‘ NEVER.’That’s the spirit CM✊

#AppuRatnaAPCM" అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.



Next Story