అధికారులపై దాడి చేస్తే తాట తీస్తాం : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
గాలివీడు ఎంపీడీవోపై దాడి బాధాకరం అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 28 Dec 2024 4:39 PM ISTగాలివీడు ఎంపీడీవోపై దాడి బాధాకరం అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీపీ తనయుడు వచ్చి తాళాలు అడిగితే ఇవ్వనందుకు దాడి చేశారు.. మండలం అభివృద్ది చేసే వ్యక్తిపై ఎంత ధైర్యం ఉంటే దాడి చేస్తారని ప్రశ్నించారు. వైసీపీ నాయకులకు ఇంకా అహంకారం చావలేదు.. అహంకారంతోనే ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేశారన్నారు. జల్లా సుదర్శన్‌కు దాడి చేయడం కొత్త కాదు.. గతంలో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులపై సుదర్శన్ రెడ్డి దాడి చేశారు.. జల్లా సుదర్శన్ రెడ్డి అహంకారంతో నిండిపోయారు. జవహార్ బాబు కులాన్ని దూషించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుదర్శన్ రెడ్డి గతంలో శేఖర్ నాయక్, ప్రతాప్, శ్రీనివాస రెడ్డిపై దాడి చేశారు.. గత ప్రభుత్వంలా కాదు.. ఇష్టా రాజ్యంగా చేస్తే మా ప్రభుత్వం సహించదన్నారు. అదనపు బలగాలను పంపి సీఐని పంపిస్తే కాని పరిస్దితి అదుపులోకి వచ్చిందన్నారు. అహంకారం తీస్తాం.. తోలు తీసి కింద కూర్చోబెడతాం.. అధికారులపై దాడి చేస్తే తాట తీస్తాం అని హచ్చరించారు. వైసీపీ వారికి కళ్ళు నెత్తికెక్కాయి.. మేము సైలెంట్‌గా కూర్చోమన్నారు. ఎలా నియంత్రిస్తే దారిలోకి వస్తారో మాకు తెలుసు అన్నారు.
అధికారులపై దాడులు చేసినా .. అడ్డుకున్నా సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. మీకు చట్టాలు తెలిసి ఉండొచ్చు అయినా శిక్షలు తప్పవన్నారు.. ఎంపీడీవో జవహర్ బాబు భార్య చాలా భయపడ్డారు.. రాయలసీమ యువత మేలుకోండి.. ఇలాంటి దాడులు ఎదుర్కోండి.. వారిని నియంత్రించండి అని పిలుపునిచ్చారు.
జవహార్ బాబును కులం పేరుతో తిట్టి, రిటైర్డ్ అయినా చంపుతామని బెదిరించారంటే.. వీరి అహంకారం అర్దం అవుతుంది.. మేము జవహార్ బాబు కుటుంబానికి అండగా ఉంటామన్నారు. రాయలసీమలో ఆధిపత్య ధోరణి నశించాలి.. ఇలాంటివి భవిష్యత్‌లో జరగకుండా అధికారులకు పూర్తి పర్మిషన్ ఇచ్చామని తెలిపారు.
కడపలో రైతుకటుంబం చనిపోవడం భాదాకరం అన్నారు. ఎందుకు చనిపోయారనేది రెండు విధాలుగా విచారణ జరుగుతుందన్నారు. అప్పులతో చనిపోయారా లేక ఎవరైనా బెదిరిస్తే చనిపోయారా అనేదానిపై విచారణ జరుగుతుంది.. జిల్లాలో అటవీ శాఖ భూములు అన్యాక్రాంతంపై ఇక్కడికే వచ్చి రివ్యూ చేస్తానని తెలిపారు.