వైసీపీ హామీలపై పవన్ ట్వీట్.. 'నేటి నవరత్నాలు.. బావితరాలకు నవ కష్టాలు'
Pawan Kalyan tweet on YSRCP govt failures.రిపబ్లిక్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జగన్ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్
By తోట వంశీ కుమార్ Published on
27 Sep 2021 8:27 AM GMT

'రిపబ్లిక్' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జగన్ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపగా.. పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఏపీ మంత్రులు కూడా పవన్‌పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. తాజాగా జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై పవన్ కళ్యాణ్ ఓ ట్వీట్ చేశారు. ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం పన్నురుద్దుతోందని విమర్శించారు. నేటి నవరత్నాలు.. బావితరాలకు నవ కష్టాలు అని పవన్ ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మరియు వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని, రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం చేసిన వాగ్దానాలు-వాటిని అమలు చెయ్యడంలో కనిపిస్తున్న కటిక నిజాలు పేరిట #saveAPfromYSRCP హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ పోస్ట్ చేశారు.
Next Story