డ్రగ్స్‌కు హ‌బ్‌గా ఏపీ : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

Pawan Kalyan tweet on Andhra Pradesh Drugs Issue.ఏపీ మాద‌క‌ద్ర‌వ్యాల హ‌బ్‌గా మారింద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Oct 2021 12:14 PM IST
డ్రగ్స్‌కు హ‌బ్‌గా ఏపీ : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

ఏపీ మాద‌క‌ద్ర‌వ్యాల హ‌బ్‌గా మారింద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆరోపించారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక సమస్యలను తెలుసుకోవ‌డానికి 2018లో పోరాట యాత్ర చేశాన‌ని.. ఆ స‌మ‌యంలో ఏపీ-ఒడిస్సా స‌రిహ‌ద్దులో గంజాయి ర‌వాణ‌, మాఫియా వంటి అంశాలు త‌న దృష్టికి వ‌చ్చాయ‌ని ప‌వ‌న్ ట్వీట్ చేశారు. గిరిజన ప్రాంతాలలో ఆరోగ్యం, నిరుద్యోగం, అక్రమ మైనింగ్ కు సంబంధించిన ఫిర్యాదులొచ్చాయ‌ని తెలిపారు.

మ‌రో ట్వీట్‌లో ఏపీ గంజాయి హ‌బ్‌గా మారింద‌న్నారు. ఏపీలో గంజాయి మూలాలున్నాయంటూ హైద‌రాబాద్ సీపీ, న‌ల్ల‌గొండ ఎస్పీ చేసిన వ్యాఖ్యాల వీడియోల‌ను ప‌వ‌న్ ట్వీట్ల‌కు జ‌త చేశారు.

''ఏపీ నార్కోటిక్స్ హబ్‌గా మారింది అంతేకాదు ప్రతి స్థాయిలో చాలా మంది డ్రగ్స్ లార్డ్‌లతో నిండిపోయింది. ఇది దేశం మొత్తం ప్రభావం చూపుతోంది. ప్రభుత్వ ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న నాయకులు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని తెలంగాణ లోని నల్గొండ ఎస్పీ రంగనాధ్ మాటలతో అర్ధమవుతుంది'' అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

Next Story