ఏపీలో రాక్షస పాలన అంతమే వారాహి లక్ష్యం: పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan said that Varahi Vahana's aim is to end the demon rule in AP. ఆంధ్రప్రదేశ్‌లోని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాలనను.. దెయ్యాల

By అంజి  Published on  25 Jan 2023 8:10 AM GMT
ఏపీలో రాక్షస పాలన అంతమే వారాహి లక్ష్యం: పవన్‌ కల్యాణ్‌

ఆంధ్రప్రదేశ్‌లోని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాలనను.. దెయ్యాల పాలనగా అభివర్ణిస్తూ, ఆ పాలనను అంతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని జనసేన అధ్యక్షుడు, టాలీవుడ్ నటుడు పవన్ కల్యాణ్ బుధవారం అన్నారు. విజయవాడ కనకదుర్గ ఆలయంలో పూజలు నిర్వహించి తన ఎన్నికల ప్రచార వాహనం వారాహికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. సంప్రదాయ ఆచారంలో భాగంగా అధిష్టాన దేవతకు పసుపు, కుంకుమ, చీర, కంకణాలు, పూలు, పండ్లను పవన్‌ కల్యాణ్‌ సమర్పించారు.

ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య జనసేన అధ్యక్షుడిని ఆశీర్వదించారు. ఇంద్రకీలాద్రి దిగువన ఉన్న విజయ గణపతి ఆలయం వద్ద ఆయన ఎన్నికల ప్రచార వాహనానికి ప్రత్యేక పూజలు చేశారు. పవన్ కళ్యాణ్ వెంట జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, విజయవాడకు చెందిన ఇతర నేతలు ఉన్నారు. జన సేన అధ్యక్షునికి కొండపై ఉన్న గుడి వరకు సాగిన ప్రయాణమంతా ఘనస్వాగతం లభించింది. అమ్మవారికి పూజలు చేసిన తర్వాత పవన్‌ మాట్లాడారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు.

విజయవాడ దివ్య క్షేత్రం కాబట్టి.. ఇక్కడ రాజకీయాలు మాట్లాడకుడదన్నారు. నిన్న కొండగట్టులో వారాహి పూజాలు చేశామన్న పవన్‌.. దుర్గమ్మ ఆశీస్సులు కూడా వారాహికి ఉండాలనే ఉద్దేశంతో నేడు విజయవాడకు వచ్చామన్నారు. నేటి నుంచి రాష్ట్రంలో రాక్షసపాలన అంతం కావాలన్నారు. తెలుగు రాష్ట్రాలు ఐక్యతతో ఉండాలన్నారు. వారాహి అంటే దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించేది అని అర్థమని పవన్ అన్నారు. ఈ ప్రచార వాహనం విజయ తీరాల వైపు ప్రయాణించనుందన్నారు.


Next Story