పవన్ కళ్యాణ్ సూచన ఇదే.. జాగ్రత్త..!

Pawan Kalyan Request To Public. తాజాగా పవన్ కళ్యాణ్ కరోనా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరారు.

By Medi Samrat  Published on  18 April 2021 12:05 PM GMT
Pawan Kalyan

భారతదేశంలో కరోనా ఉధృతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మంది ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కరోనా మహమ్మారి ఏ ఒక్కరినీ వదలడం లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కరోనా బారిన పడ్డాడు. పవన్ కళ్యాణ్ కోలుకోవాలని ఆయన అభిమానులు పూజలు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ బెడ్ మీద పడుకుని ఉన్న ఫోటో కూడా బాగా వైరల్ అయ్యింది.

తాజాగా పవన్ కళ్యాణ్ కరోనా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరారు. ప్రస్తుతం తాను వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ కోలుకుంటున్నానని తెలిపారు. వీలైనంత త్వరలో ప్రజల ముందుకు వస్తానని పవన్ తెలిపారు. తన క్షేమం కోసం అన్ని వర్గాల వారు సందేశాలు పంపారని, అభిమానులు, జనసైనికులు ఆలయాల్లో, ప్రార్థన మందిరాల్లో పూజలు, ప్రార్థనలు చేశారని వారందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు అనే పదాలతో తన భావోద్వేగాలను వెల్లడించలేకపోతున్నానని అన్నారు.

కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పవన్ సూచించారు. ఏపీలో 7 వేలు, తెలంగాణలో 4 వేలకు పైగా కొత్త కేసులు వస్తున్నాయని, ఈ కష్టకాలంలో ప్రభుత్వాలు మరింత సన్నద్ధతతో వ్యవహరించాలని సూచించారు. అయితే, కేసుల తీవ్రతను అంచనా వేయడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని, రోగుల సంఖ్యకు అనుగుణంగా బెడ్లు, అత్యవసర ఔషధాలు, ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పవన్ ఇటీవలే కరోనా బారినపడి తన ఫాంహౌస్ లోనే చికిత్స పొందుతున్నారు.



Next Story
Share it