కేబినెట్ భేటీ అయిన వెంట‌నే ఢిల్లీకి బ‌య‌లుదేరిన‌ పవన్ కళ్యాణ్..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీకి బయలుదేరారు.

By Medi Samrat  Published on  6 Nov 2024 3:20 PM IST
కేబినెట్ భేటీ అయిన వెంట‌నే ఢిల్లీకి బ‌య‌లుదేరిన‌ పవన్ కళ్యాణ్..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీకి బయలుదేరారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన ఢిల్లీ విమానం ఎక్కారు. ఢిల్లీలో ఈ రోజు సాయంత్రం కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తో సమావేశం అవుతారు.

వెలగపూడి సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి బయలుదేరారు. రోడ్డు మార్గంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన విమానంలో బయలుదేరి 5:45 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ అవ్వనున్నారు.

ఢిల్లీలో సాయంత్రం 6:30 నుండి 7:00 గంటల మధ్య కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ కీలక సమావేశానికి సంబంధించిన ఎజెండాలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన వివిధ అంశాలపై చర్చలు జరపనున్నారు. ప్రస్తుత ఏపీ రాజకీయ వాతావరణం దృష్ట్యా పవన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story