కోనసీమ కొబ్బరి రైతులకిచ్చిన హామీ నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్

కోనసీమ జిల్లా పరిధిలోని శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు

By -  Knakam Karthik
Published on : 30 Dec 2025 1:40 PM IST

Andrapradesh, Amaravati, Deputy CM Pawan Kalyan, Ambedkar Konaseema District

కోనసీమ కొబ్బరి రైతులకిచ్చిన హామీ నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్

అమరావతి: డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ⁠మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వర్చువల్‌గా పాల్గొన్నారు. కాగా కోనసీమ కొబ్బరి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రూ. 20.77 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులకు శ్రీకారం చుట్టారు. రాజోలు పర్యటనలో 45 రోజుల్లో శంకరగుప్తం డ్రెయిన్ సమస్యను పరిష్కరిస్తానని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు.

Next Story