ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వెండి తెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా మన 'ఊరు-మాటామంతి' అనే పేరుతో ప్రజలతో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు. లైవ్ ప్రోగ్రామ్ ద్వారాద మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయం నుంచి ప్రజలతో ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ అయ్యారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామస్థులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడారు. మన ఊరు- మాటా మంతి పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని టెక్కలిలోని భవానీ థియేటర్‌లో నిర్వహించారు. గ్రామంలో అమలు చేస్తున్న అభివృద్ధి పనులపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, వైద్యం, విద్య,. మౌలిక వసతులపై ప్రజలతో చర్చించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పనులపై అభిప్రాయాన్ని సేకరించారు. ప్రజల సమస్యలపై వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.