విశాఖ ఉక్కుపై మరోసారి దీక్షను ఫిక్స్ చేసిన పవన్‌కల్యాణ్‌

Pawan Kalyan Deeksha at Mangalagiri on 12th. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడాలని కోరుతూ ఈనెల 12న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌

By Medi Samrat  Published on  10 Dec 2021 11:00 PM IST
విశాఖ ఉక్కుపై మరోసారి దీక్షను ఫిక్స్ చేసిన పవన్‌కల్యాణ్‌

విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడాలని కోరుతూ ఈనెల 12న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ నిరాహారదీక్ష చేయనున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన నాయకులు పాల్గొననున్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు సంఘీభావంగా…పవన్‌కల్యాణ్‌ ఈనెల 12వ తేదీన ఈ దీక్షను చేయనున్నారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పవన్‌కల్యాణ్‌ దీక్షను చేయనున్నారని పార్టీ వర్గాలు ప్రకటించాయి.

విశాఖను పరిరక్షించాలని కార్మికులు, ప్లాంట్‌ నిర్వాహకులు గత మూడు వందల రోజులుగా ఆందోళన చేపడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని పవన్ ఆరోపించారు. విశాఖ పరిశ్రమను రక్షించాలని కోరుతూ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్‌ చేశారు.పవన్‌తో పాటు పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్‌, పీఏసీ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, అనుబంధ విభాగాల ఛైర్మన్లు దీక్షలో పాల్గొంటారని పేర్కొన్నారు.


Next Story