మ‌ద్య నిషేదం కాదు.. మందుపైనే ఆదాయం : ప‌వ‌న్ క‌ళ్యాణ్

Pawan Kalyan comments satirically on AP GOVT.వైసీపీ ప్ర‌భుత్వం పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోసారి విమ‌ర్శ‌నాస్త్రాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Jun 2022 1:18 PM IST
మ‌ద్య నిషేదం కాదు.. మందుపైనే ఆదాయం : ప‌వ‌న్ క‌ళ్యాణ్

వైసీపీ ప్ర‌భుత్వం పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోసారి విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. ప్ర‌భుత్వ మ‌ద్యం విధానం పై ప‌వ‌న్ ట్వీట్ చేశారు. దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయాల మేర ఆదాయం సమకూర్చటం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై సెటైక‌రిక‌ల్‌గా స్పందించారు.

లిక్కర్‌పై సంపూర్ణ నిషేధం తీసుకొస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతోందని, అంటే 9 కోట్ల నుంచి 22 కోట్లకు అమ్మకాలను పెంచి ఆ బాండ్లను విక్రయించడం ద్వారా 8,000 కోట్ల ఆదాయం వస్తుందని జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

నాదెండ్ల మనోహర్ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్.. 'సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తాం అని చెప్పి.. ఇప్పుడు 'కాదు కాదు' సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తున్నారు అన్న‌ట్లుగా ప‌రిస్థితి త‌యారైందన్నారు. సారా బట్టీలు, బ్రాందీ డిస్టిలరీలు కూడా వారివేన‌ని 'చిన్న గమనిక' అంటూ ట్వీట్ చేశారు. వీటి ద్వారా వ‌చ్చే అదనపు వేల కోట్ల ఆదాయం కూడా వారికేన‌ని' ప‌వ‌న్ ఆరోపించారు. 'అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు' అంటూ బైబిల్ సూక్తిని ప‌వ‌న్ ట్వీట్‌లో రాసుకొచ్చారు.

Next Story