మూడు గంటల పాటు అందులోనే.. మార్కాపురం రైల్వే స్టేషన్‌లో నరకం అనుభవించిన ప్రయాణీకులు

ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వే స్టేషన్‌లో పరిమితికి మించి లిఫ్ట్ లో ఎక్కడంతో తలుపులు తెరుచుకోలేదు.

By Medi Samrat  Published on  2 Feb 2025 12:44 PM IST
మూడు గంటల పాటు అందులోనే.. మార్కాపురం రైల్వే స్టేషన్‌లో నరకం అనుభవించిన ప్రయాణీకులు

ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వే స్టేషన్‌లో పరిమితికి మించి లిఫ్ట్ లో ఎక్కడంతో తలుపులు తెరుచుకోలేదు. దీంతో ప్రయాణికులు లిఫ్ట్‌లో చిక్కుకుపోయారు. తిరుమల నుంచి దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉన్న 14 మంది ప్రయాణికులు మూడు గంటల పాటు అక్కడే ఉండిపోయారు. వారి రోదనలు విన్న రైల్వే పోలీసులు స్పందించారు. టెక్నీషియన్లు అందుబాటులో లేకపోవడంతో రైల్వే పోలీసులు ప్రయాణికులను రక్షించేందుకు చాలా ప్రయత్నాలు చేశారు.

మార్కాపురం రైల్వే స్టేషన్ లో పరిమితికి మించి జనం ఎక్కడంతో లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. డోర్లు తెరుచుకోక, బయటకు వచ్చే మార్గం లేక ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దాదాపు 3 గంటల పాటు లోపలే ఉండడంతో మహిళలు, పిల్లలు భయంతో కేకలు వేశారు. లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన 14 మందిని క్షేమంగా బయటకు తెచ్చారు.

Next Story