సీమలో ఫ్యాక్షన్.. సంచలన ఆరోపణలు చేసిన పరిటాల సునీత

రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తన భర్త పరిటాల రవి హత్యలో జగన్ పాత్ర కూడా ఉందని సంచలన ఆరోపణలు చేశారు.

By Medi Samrat
Published on : 3 April 2025 7:16 PM IST

సీమలో ఫ్యాక్షన్.. సంచలన ఆరోపణలు చేసిన పరిటాల సునీత

రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తన భర్త పరిటాల రవి హత్యలో జగన్ పాత్ర కూడా ఉందని సంచలన ఆరోపణలు చేశారు. పరిటాల రవి హత్య కేసులో సీబీఐ జగన్ ను కూడా విచారించిందని గుర్తు చేశారు. టీవీ బాంబు గురించి మాట్లాడుతున్న వారు కారు బాంబు గురించి కూడా మాట్లాడాలన్నారు. రాప్తాడులో తోపుదుర్తి సోదరులు ముఠా కక్షలను రెచ్చగొడుతున్నారని సునీత అన్నారు. ఓబుల్ రెడ్డి, మద్దెలచెరువు సూరి కుటుంబాలను ఫ్యాక్షనిజంలోకి మళ్లీ లాగుతున్నారన్నారు.

తోపుదుర్తి సోదరుల మాటలు నమ్మి ఈ కుట్రలో భాగస్వామ్యం కావొద్దని కనుముక్కల ఉమ, గంగుల భానుమతికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఇప్పటికే మూడు కుటుంబాలు ఫ్యాక్షన్ కారణంగా చాలా నష్టపోయాయని, కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని తెలిపారు. ఇప్పుడు మళ్లీ తోపుదుర్తి సోదరులు ఫ్యాక్షన్ ఉచ్చులోకి లాగడానికి ప్రయత్నిస్తున్నారని హెచ్చరించారు. తోపుదుర్తి సోదరులు ఏం చెప్పినా జగన్ నమ్మేస్తున్నారని, ఐదేళ్లు సీఎంగా పనిచేసిన జగన్ నిజానిజాలు తెలుసుకోవాలని హితవు పలికారు.

Next Story