ఇంకోసారి పరిటాల రవి గురించి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు: మాజీ మంత్రి సునీత

Paritala Sunitha Reacts On Gorantla Madhav Words. రాప్తాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ఎంపీ గోరంట్ల మాధవ్ పరిటాల రవి మీద

By Medi Samrat  Published on  10 Dec 2020 11:46 AM GMT
ఇంకోసారి పరిటాల రవి గురించి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు: మాజీ మంత్రి సునీత

రాప్తాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ఎంపీ గోరంట్ల మాధవ్ పరిటాల రవి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పరిటాల రవి భార్య, మాజీ మంత్రి పరిటాల రవి భార్య, మాజీ మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు. గోరంట్ల మాధవ్ ను ఉద్దేశించి మాట్లాడుతూ నీ చరిత్ర ఏమిటో మాకు తెలుసని ఆమె అన్నారు. నీ లాగా రోడ్డెక్కి మాట్లాడి, విలువను తగ్గించుకోలేమని అన్నారు సునీత. ఇంకోసారి పరిటాల రవి గురించి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని.. రవి గురించి నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావని మండిపడ్డారు. రవి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే ఎస్సీలు, ఎస్టీలు సంతోషంగా ఉన్నారని ఆమె అన్నారు.

అనంతపురం జిల్లాలో ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ రిజర్వాయర్ల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుకు వైఎస్సార్‌ అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్టుగా నామకరణం చేశారు. చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లి గ్రామంవద్ద ఏర్పాటు చేసిన పైలాన్‌, మూడు రిజర్వాయర్ల భూమి పూజ పనులను జగన్ తాడేపల్లి నుంచే వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు.

ఈ కార్యక్రమం తర్వాత ఎంపీ మాధవ్ మీడియాతో మాట్లాడుతూ.. దివంగత టీడీపీ నేత పరిటాల రవిపై సంచలన ఆరోపణలు చేశారు. నక్సలైట్లు, ఫ్యాక్షనిజం పేరుతో పరిటాల రవి ఎంతో మంది తలలు నరికాడు. చంద్రబాబు సహకారంతో ఎమ్మెల్యేగా ఉంటూ ఇలాంటి కిరాతకాలకు పాల్పడ్డాడు. రాప్తాడు నియోజకవర్గంలో పొలాలకు నీళ్లు లేక ఎండిపోతుంటే.. పరిటాల రవి రక్తపుటేర్లతో పొలాలను తడిపాడు. పంట పొలాలను రక్తంతో తడిపిన చరిత్ర పరిటాల రవిది''అని వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు మీద కూడా గోరంట్ల మాధవ్ విమర్శలు గుప్పించారు. ప్రత్యేకహోదాను కేంద్రం ముందు అమ్మేశారని, ఓటుకు నోటు కేసులో దొరికిపోయి.. అమరావతికి చంద్రబాబు పారిపోయారని విమర్శించారు. చంద్రబాబు సాయంతో పరిటాల రవి ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని.. ఎంతో మంది తలలు నరికారని అన్నారు. పచ్చని బీళ్లను సైతం రక్తంతో తడిపిన చరిత్ర రవిదని ఆరోపించారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ కు న్యాయంగా రావాల్సిన ప్రత్యేక హోదాను పశువుల సంతలా.. కేంద్రానికి వేలంలో పెట్టి అమ్మిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు గోరంట్ల మాధవ్.


Next Story
Share it