ఎన్నికల ఫలితాలకు ముందు వైసీపీకి బూస్టింగ్ ఇచ్చిన స్వామి పరిపూర్ణానంద

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో స్వామి పరిపూర్ణానంద వైసీపీకి బూస్టింగ్ ఇచ్చే వ్యాఖ్యలు చేశారు

By Medi Samrat  Published on  3 Jun 2024 7:37 PM IST
ఎన్నికల ఫలితాలకు ముందు వైసీపీకి బూస్టింగ్ ఇచ్చిన స్వామి పరిపూర్ణానంద

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో స్వామి పరిపూర్ణానంద వైసీపీకి బూస్టింగ్ ఇచ్చే వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ123 స్థానాలు సాధిస్తుందని జోస్యం చెప్పారు. రెండోసారి జగన్ సీఎం అవుతారన్నారు. ముఖ్యమైన వ్యక్తి ద్వారా అందిన సమాచారం మేరకే చెబుతున్నానని అన్నారు.

స్వామి పరిపూర్ణానంద బీజేపీ తరపున హిందూపురంలో పోటీ చేయాలని భావించారు. అయితే కూటమి కారణంగా టీడీపీకి పార్లమెంట్ స్థానాన్ని కేటాయించారు. అయితే హిందూపురంలో కూడా ఊహించని పరిణామం చూడబోతుందని స్వామి పరిపూర్ణానంద తెలిపారు. గ్రామీణ ప్రాంతాల మహిళలు అధిక శాతం వైసీపీకే ఓట్లు వేశారని అన్నారు. కేంద్రం బీజేపీకి ఎటువంటి ఢోకా ఉండదని స్వామి పరిపూర్ణానంద చెప్పారు. మూడోసారి మోదీ ప్రధాని అవుతారని అన్నారు.

Next Story