అమరావతి: తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలకు అత్యవసర సరుకులు పంపిణీ చేసేందుకు సంబంధించిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తుపాను బాధితులకు వెంటనే ఆహార వస్తువులు ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభావిత కుటుంబాలు, మత్స్యకారులకు సరుకులు ఉచితంగా అందించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
కాగా మత్స్యకారులకు 50 కేజీల చొప్పున బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. అలాగే కిలో కందిపప్పు, పామాయిల్ కేజీ, ఉల్లిపాయలు కేజీ, బంగాళదుంపలు కేజీ, చక్కెర కేజీ పంపిణీకి ప్రభుత్వం ఆదేశించింది. ఉల్లిపాయలు, కూరగాయల సరఫరా బాధ్యతలను మార్కెటింగ్ కమిషనర్‌కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది.