ఆగస్టు 15న 100 అన్న క్యాంటీన్ల ప్రారంభం.. జాబితా ఇదే

ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పేదవారి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది.

By అంజి
Published on : 14 Aug 2024 8:45 AM IST

Anna canteens, TDP Govt, Chandrababu, APnews

ఆగస్టు 15న 100 అన్న క్యాంటీన్ల ప్రారంభం.. జాబితా ఇదే

ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పేదవారి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. 16వ తేదీ నుంచి ఇవి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్నిచోట్ల ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఎక్కడెక్కడ, ఎన్నెన్ని ఏర్పాటు చేయాలన్న విషయంలో పురపాలకశాఖ మంత్రి నారాయణ అధికారులతో సోమవారం చర్చించారు. ఈ క్రమంలోనే 33 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రారంభించే ఈ క్యాంటీన్ల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. . మొత్తంగా తొలి విడతలో 100 క్యాంటీన్‌లు అందుబాటులోకి రానున్నాయి.

కాగా కృష్ణా జిల్లా ఉయ్యూరులో సీఎం చంద్రబాబు పర్యటించి క్యాంటీన్‌ను ప్రారంభిస్తారు. గతంలో టీడీపీ హయాంలో చాలా చోట్ల అన్న క్యాంటీన్లను ఏర్పాట్లు చేశారు. కేవలం రూ.5 నామమాత్రపు ధరకే రుచికరమైన భోజనం పెట్టేవారు. వలస కూలీలు, కార్మికులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత వీటిని సద్వినియోగం చేసుకునేవారు. దీంతో ఈ క్యాంటీన్లకు మంచి ప్రజాదరణ లభించింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వీటిని పక్కన పెట్టింది. అయితే ఈసారి టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో క్యాంటీన్లకు పూర్వ వైభవం రానున్నాయి.


Next Story