ప్రతి భక్తుడికి తలంబ్రాలు, అన్నప్రసాదాలు

ఒంటిమిట్ట ఏకశిలానగరంలో ఏప్రిల్ 11న జరుగనున్న సీతారాముల కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందించేలా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ తెలిపింది.

By Medi Samrat
Published on : 5 April 2025 9:02 PM IST

ప్రతి భక్తుడికి తలంబ్రాలు, అన్నప్రసాదాలు

ఒంటిమిట్ట ఏకశిలానగరంలో ఏప్రిల్ 11న జరుగనున్న సీతారాముల కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందించేలా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ తెలిపింది. ఒంటిమిట్టలోని టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో శనివారం సమీక్ష, సమావేశం జరిగింది.

కల్యాణ వేదిక ప్రాంగణం వద్ద ఉన్న 120 గ్యాలరీలలో ఉండే భక్తులతో పాటు, కల్యాణం వీక్షించేందుకు వచ్చిన భక్తులందరూ శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ తెలిపింది. కల్యాణ వేదిక ప్రవేశ ప్రారంభంలో తలంబ్రాలు పంపిణీ కోసం 16 కౌంటర్లు ఏర్పాటు చేశారు. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం తిలకించేలా 15 ఎల్ ఈడీ స్క్రీన్ లు, ఆలయం , కల్యాణ వేదిక, తదితర ప్రాంతాల్లో విద్యుత్ కాంతులతో 38 దేవతామూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. విజిలెన్స్ శాఖ ఆధ్వర్యంలో 100 సిసి కెమెరాలు, 3 డ్రోన్ లు, 3 కంట్రోల్ రూమ్ లు, దాదాపు 2400 మంది భద్రతా సిబ్బందిని విధుల్లో ఉంచారు. బ్రహ్మోత్సవాలకు దాదాపు 3 లక్షల తాగునీరు బాటిల్స్, 250 మంది పారామెడికల్ సిబ్బంది, 35 మంది వైద్య నిపుణులు, 13 మెడికల్ టీంలు, 8 అంబులెన్స్ లు, అగ్నిమాపక సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story