అమరావతి: తిరుమలలో వైకుంఠద్వార దర్శనాల కోసం ఈ నెల 27వ తేదీన అంటే రేపు ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. టీటీడీ వెబ్‌సైట్, యాప్‌తో పాటు 9552300009 వాట్సాప్ నంబర్‌తోనూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. భక్తులు హాయ్ లేదా గోవిందా అని మెసేజ్ చేస్తే దర్శనాల ఆప్షన్ కనిపిస్తుంది. డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలి. డిసెంబర్ 1న సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంటుంది.
డిసెంబర్ 2న మధ్యాహ్నం 2 గంటలకు టోకెన్లు కేటాయిస్తారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. తొలి 3 రోజులు ఎలక్ట్రానికి్ డిప్ ద్వారా, తర్వాత 7 రోజులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 ద్వారా సర్వదర్శనాలు ఉంటాయని తెలిపింది. ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా ఇతర ప్రత్యేక దర్శనాలకు, ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. ఈ నెల 27 నుంచి డిసెంబర్ 1 వరకు వెబ్‌సైట్, యాప్‌లో ఈ డిప్‌కు నమోదు చేసుకోవచ్చని చెప్పింది.