గోదావారి నదిలో ONGC చమురు సంస్థ వేసిన పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతూ ఉండడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తూ ఉంది. శనివారం తెల్లవారుజామున నుంచి నదిలో నుండి గ్యాస్ పైకి ఎగిసి వస్తోంది. యానాం దరియాలతిప్ప కాట్రేనికోన మండలం బలుసుతిప్ప మధ్యలో ఈ లీకేజీ జరిగింది.
మంటలు ఎగిసిపడే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ లీకేజీని ఆపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కిలోమీటర్ల దూరం వరకు గ్యాస్ వాసన వస్తోందని, మంటలు చెలరేగే అవకాశం కూడా ఉందని భయపడుతూ ఉన్నారు. ప్రత్యక్ష సాక్ష్యులు మాట్లాడుతూ గోదావరిలో సుడులు తిరుగుతూ వేస్తూ నీరు పైకి ఉబికి వచ్చిందని తెలిపారు. మొదట దీని గురించి స్థానిక మత్స్యకారులు గమనించారు.