ఏప్రిల్ 4న కొత్త జిల్లాలను ప్రారంభించనున్న సీఎం జగన్

Notification on new districts will be issued in two days. ఏప్రిల్ 4న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొత్త జిల్లాలను ప్రారంభించనున్నారని

By Medi Samrat  Published on  1 April 2022 4:27 PM IST
ఏప్రిల్ 4న కొత్త జిల్లాలను ప్రారంభించనున్న సీఎం జగన్

ఏప్రిల్ 4న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొత్త జిల్లాలను ప్రారంభించనున్నారని ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ తెలిపారు.ఈ మేరకు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. 26 జిల్లాలకు సంబంధించి రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని స్పష్టం చేశారు. మొత్తం 284 అంశాలపై ప్రజల నుంచి 17,500కు పైగా సూచనలు, అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. 90 శాతం అంశాలను సీఎం వైఎస్‌ జగన్‌ సానుకూలంగా పరిష్కరించారని విజయ్‌ కుమార్‌ తెలిపారు.

ప్రజల డిమాండ్ మేరకు కొన్ని మండలాలను జిల్లాలుగా మార్చామని, ప్రజల సౌకర్యార్థం పూర్తి శాస్త్రీయంగా పునర్విభజన చేశామని ప్రణాళికా శాఖ కార్యదర్శి తెలిపారు. ప్రతి జిల్లాలో కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి, అదనంగా ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయబడుతుంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు జిల్లాల పునర్విభజన జరిగిందని, ఏప్రిల్ 4 తర్వాత కొత్త జిల్లాలను కేంద్ర ప్రణాళికా విభాగానికి పంపుతామని ప్రణాళికా కార్యదర్శి విజయ్ కుమార్ తెలిపారు.











Next Story