నామినేషన్ దాఖలు చేసిన ముగ్గురు అభ్యర్థులు

ఏపీలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.

By Medi Samrat  Published on  10 Dec 2024 6:45 PM IST
నామినేషన్ దాఖలు చేసిన ముగ్గురు అభ్యర్థులు

ఏపీలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ నుంచి బీదా మస్తాన్ రావు, సానా సతీశ్, బీజేపీ నుంచి ఆర్.కృష్ణయ్య కూటమి తరఫున బరిలో దిగుతున్నారు. కూటమి అభ్యర్థులు నేడు నామినేషన్లు దాఖలు చేశారు. ఏపీ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర సమస్యలను పెద్దల సభలో లేవనెత్తుతామని తెలిపారు. ఖాళీగా ఉన్న ఈ మూడు రాజ్యసభ స్థానాలకు ముగ్గురు మాత్రమే నామినేషన్లు వేయడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

వైసీపీని వీడి బీజేపీలో చేరిన బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. గతంలో ఆయన వైసీపీ తరపున రాజ్యసభకు వెళ్లారు. ఎన్నికల తర్వాత రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీకి ఆయన రాజీనామా చేశారు. వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వాలకు ఆర్ కృష్ణయ్యతో పాటు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు కూడా రాజీనామా చేశారు. మోపిదేవి, బీద మస్తాన్ రావు టీడీపీలో చేరారు.

Next Story