ఏపీలో నామినేటెడ్ పోస్టుల ప్రకటన
Nominated posts list announced in AP.ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ సంస్థల్లో నామినేటెడ్ పోస్టులను శనివారం
By తోట వంశీ కుమార్ Published on 17 July 2021 1:01 PM ISTఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ సంస్థల్లో నామినేటెడ్ పోస్టులను శనివారం ప్రకటించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, హోంమంత్రి మేకతోటి సుచరిత రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పోస్టులను విడుదల చేశారు. 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. నామినేటెడ్ పదవులు అలంకార ప్రాయం కాదని, పదవులు తీసుకున్నవారు బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. పదవుల భర్తీలో సీఎం సామాజిక న్యాయం పాటించారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 76 పదవులు ఇచ్చామని సజ్జల తెలిపారు.
నామినేటెడ్ పోస్టుల వివరాలు..
సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి
వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌గా అక్కరమాని విజయనిర్మల
ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌గా గేదెల బంగారు
గ్రంథాలయ ఛైర్ పర్సన్‌గా రెడ్డి పద్మావతి
హితకారిణి సమాజం ఛైర్మన్‌గా కాశీ మునికుమారి
శ్రీకాకుళం జిల్లా: 7 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు,
విజయనగరం జిల్లా: 7 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు
విశాఖ జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు
తూర్పు గోదావరి: 17 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 9 పోస్టులు
పశ్చిమగోదావరి: 12 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు
కృష్ణా జిల్లా : 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు
గుంటూరు జిల్లా : 9 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు
ప్రకాశం జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు
నెల్లూరు జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు
చిత్తూరు జిల్లా: 12 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 7 పోస్టులు
అనంతపురం : 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు
వైఎస్సార్ జిల్లా: 11 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు
కర్నూలు జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు