ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌గా నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

By అంజి  Published on  7 Jun 2024 4:42 AM GMT
Nirabh Kumar Prasad , Chief Secretary, AP Government, Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌గా నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 1987వ బ్యాచ్‌కు చెందిన నీరభ్‌.. గతంలో భూపరిపాలన ప్రధాన కమిషనర్‌గా పని చేశారు. ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. చంద్రబాబును నీరభ్‌ కుమార్‌ నిన్న మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లిన విషయం తెలిసిందే. అలాగే ప్రస్తుత సీఎస్‌ జవహర్‌ రెడ్డిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఇప్పటిరకు సీఎస్‌గా ఉన్న జవహర్‌ రెడ్డి గురువారం సెలవుపై వెళ్లారు. ఆయన జూన్‌ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Next Story