కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. ఏపీ ప్రభుత్వం బిగ్ అప్‌డేట్
కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు పంపిణీ చేయనుంది.
By అంజి
కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
అమరావతి: కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు పంపిణీ చేయనుంది. ఆగస్టు 25 నుండి రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు అందుబాటులోకి వస్తాయని వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. సోమవారం పాడేరులోని కలెక్టరేట్‌లో పౌర సరఫరాలు, ఇతర శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1.46 కోట్ల కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి ధృవీకరించారు. ఏటీఎం తరహాలో ఉండే ఈ కార్డులపై ఒకవైపు ప్రభుత్వ అధికారిక చిహ్నం, మరోవైపు కుటుంబ పెద్ద ఫొటో ఉంటాయి.
వచ్చే నెల నుంచి ఈ కార్డులపైనే రేషన్ పంపిణీ చేస్తారు. గిరిజన ప్రాంతాల్లో రేషన్ డిపోలకు దూరంగా ఉన్న వారికి ఇంటి వద్దే సరుకులు ఇస్తామని మంత్రి మనోహర్ తెలిపారు. ఇందుకోసం 69 మినీ రేషన్ డిపోలను ఏర్పాటు చేస్తామన్నారు. కొత్త వ్యవస్థ కింద ప్రజలకు మెరుగైన సేవలను అందించే లక్ష్యంతో సంకీర్ణ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖలో అనేక సంస్కరణలను ప్రారంభించిందని ఆయన పేర్కొన్నారు. సమర్థవంతమైన సేవల పంపిణీకి తన నిబద్ధతను ప్రదర్శిస్తూ, 96.4% e-KYCని పూర్తి చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అగ్రస్థానాన్ని సాధించిందన్నారు.