ఏపీ పట్టాదారు పాస్ బుక్‌ల‌లో ఈ మార్పులు రాబోతున్నాయి.!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు రానున్నాయి.

By Medi Samrat  Published on  29 July 2024 7:46 PM IST
ఏపీ పట్టాదారు పాస్ బుక్‌ల‌లో ఈ మార్పులు రాబోతున్నాయి.!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు రానున్నాయి. గత ప్రభుత్వం భూ యజమానులకు ఇచ్చే పట్టాదార్ పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో కోసం కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేసిందని.. ఇకపై కేవలం రాజముద్రతో కూడిన కొత్త పాస్ బుక్ లు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. రాజముద్రతో కూడిన కొత్త పాస్ పుస్తకాన్ని అధికారులు సీఎం చంద్రబాబుకు చూపించారు. కొత్త పాస్ బుక్ పై క్యూఆర్ కోడ్ ను కూడా పొందుపరిచారు. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే పట్టాదారు పేరిట ఉన్న ఆస్తుల వివరాలన్నీ స్క్రీన్ పై ప్రత్యక్షమవుతాయి.

సీఎం చంద్రబాబు రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖపై సమీక్ష నిర్వహించారు. పట్టాదార్ పాస్ పుస్తకాలపై రాజముద్ర తప్పనిసరిగా ఉండేలా చూడాలని సీఎం చంద్రబాబు అధికారుల ఆదేశించారు. పార్టీల రంగులు, నేతల ఫొటోలు ఉండకూడదని సూచించారు.

Next Story