వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబంలో జరుగుతున్న ఆస్తులు, షేర్ల పంపకంపై నేషనల్ కంపెనీ లా ట్రెబ్యునల్( NCLT ) డిసెంబర్ 13కు విచారణను వాయిదా వేసింది. తనకు తెలియకుండా తల్లి, చెల్లి షేర్లు బదిలీ చేసుకున్నారని ఎన్‌సీఎల్‌టీలో విజయమ్మ , షర్మిల, జనార్దన్‌రెడ్డిని ప్రతివాదులుగా పేర్కొంటూ జగన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. విజయమ్మ, షర్మిల తరఫు న్యాయవాది కౌంటర్ దాఖలుకు సమయం కోరారు. ఎన్‌సీఎల్‌టీ విచారణను వాయిదా వేసింది. జగన్, భారతి, క్లాసిక్ రియాల్టీ పేరిట ఉన్న 51.01 శాతం షేర్లు యథావిధిగా కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని జగన్ కోరారు.
ఈ వివాదం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. జగన్ మోహన్ రెడ్డి తరఫు లాయర్ వాదనలు వినిపించగా, ఇక ప్రతివాదులుగా ఉన్న వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల వాదనలను కూడా కోర్టు వినాల్సి ఉంది. కౌంటర్ లో ఏమి చెబుతారా అని అందరూ ఎదురుచూస్తూ ఉన్నారు.