నారా లోకేష్ ఆస్తుల విలువెంతో తెలుసా..?

మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్, ఆయన భార్య ఆస్తుల విలువ రూ.5,236,352,582 (రూ.523 కోట్లు) గా ప్ర‌క‌టించారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 April 2024 4:37 AM GMT
నారా లోకేష్ ఆస్తుల విలువెంతో తెలుసా..?

మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్, ఆయన భార్య ఆస్తుల విలువ రూ.5,236,352,582 (రూ.523 కోట్లు) గా ప్ర‌క‌టించారు. టీడీపీ, వైసీపీలకు ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గాల్లో మంగళగిరి ఒకటి. ఓటమి పాలైనప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ అదే నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి పోటీ చేస్తున్నారు. నామినేష‌న్ వేసిన నేప‌థ్యంలో ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో త‌న ఆస్తుల వివ‌రాలు వెల్ల‌డించారు నారా లోకేష్‌.

ఆదాయం

లోకేష్- రూ.1,41,64,363.

జీవిత భాగస్వామి- రూ. 7,57,04,812.

చరాస్తులు-

లోకేష్- రూ.341,68,22,459.

జీవిత భాగస్వామి- రూ. 45,06,30,277.

స్థిరాస్తులు-

లోకేష్- రూ.92,31,09,546.

జీవిత భాగస్వామి- రూ. 35,59,21,125.

మొత్తం అప్పులు-

లోకేష్- రూ.3,48,81,937.

జీవిత భాగస్వామి- రూ. 14,34,37,042.

ఆస్తులు- హెరిటేజ్ ఫుడ్స్, రిలయన్స్‌లో షేర్లు. లోకేష్‌ జీవిత భాగస్వామి బ్రాహ్మణికి మాదాపూర్‌లో భూమి, రంగారెడ్డిలో వ్యవసాయ భూమి, చెన్నైలో వాణిజ్య భవనం ఉన్నాయి. లోకేష్, ఆయన తండ్రి నారా చంద్రబాబు నాయుడు సంయుక్తంగా రూ.7,99,59,988 విలువైన ఇంటిని నిర్మించారు.

బ్రాహ్మణి పేరిట‌..

1. ఆమె తల్లి ఎన్ వసుంధరా దేవి నుండి అప్పు రూ. 42,23,091 తీసుకున్నారు.

2. ఆమె తండ్రి ఎన్ బాల కృష్ణ నుండి రూ.16,19,986 అప్పుగా తీసుకున్నారు.

3. ఆమె అత్త నారా భువనేశ్వరి నుండి రూ.10,01,72,198 హ్యాండ్ లోన్ తీసుకున్నారు.

బ్రాహ్మణి, ఆమె కుమారుడు దేవాన్ష్ జూబ్లీహిల్స్‌లో 50% వాటాతో వాణిజ్య భవనాన్ని కలిగి ఉన్నారు.

బ్రాహ్మణి వద్ద రూ. 1,33,99,579 విలువైన 2500.338 గ్రాముల బంగారం, రూ. 1,48,65,827 విలువైన డైమండ్‌, ర‌త్నాల‌తో కూడిన అభ‌ర‌ణాలు క‌లిగిఉన్నారు.

విద్య- మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం.

మొత్తం 23 క్రిమిన‌ల్‌ కేసులు స‌హా..

1. అనుమతి లేకుండా సమావేశం నిర్వహించడం

2. ఏపీ రాజధాని ప్రాంతానికి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో కుట్ర

3. మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్‌ రోడ్ షోలో బాలిక మృతిపై సోషల్ మీడియా పోస్ట్ వంటి కేసులు ఉన్న‌ట్లు పేర్కొన్నారు.

Next Story