ఉపాధ్యాయులకు ఏపీ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 లక్షల మందికి పైగా ఉపాధ్యాయులకు మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేష్ శుబావార్త చెప్పారు.

By Kalasani Durgapraveen  Published on  16 Nov 2024 2:24 AM GMT
ఉపాధ్యాయులకు ఏపీ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 లక్షల మందికి పైగా ఉపాధ్యాయులకు మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేష్ శుభవార్త చెప్పారు. త్వరలోనే ఉపాధ్యాయుల పై ఉన్న కేసులను అన్నింటినీ ఎత్తి వేస్తామని తెలిపారు. దీనికి సంబంధించి రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరు మలరావుతో మాట్లాడుతున్నామన్నారు. ఆయన దీనిపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తారని తెలిపారు.

జగన్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు వేతన బకాయిలు, డీఏ బకాయిలతోపాటు 2019 నాటి ఎన్నికల్లో వైసీపీ ఇచ్చిన కీలక హామీల్లో ఒకటైన సీపీఎస్ విధానం రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ ఉద్య మించారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఉపాధ్యాయులు కూడా కలిసి కట్టుగా యుద్ధం ప్రకటించారు. విజయవాడలో మిలియన్ మార్చ్‌కు పిలుపునిచ్చారు. వీరి ఉద్య మాన్ని వైసీపీ ఎక్కడికక్కడ నిలువరించింది. అరెస్టులు చేసి ఉపాధ్యాయులపై అనేక కేసులు పెట్టారు.

రెండు నుంచి నాలుగు, కొందరిపై పదుల సంఖ్యలోనే తీవ్ర కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు సర్కారు మారడంతో తమపై అప్పట్లో వైసీపీ ప్రభుత్వ సూచనల మేరకు పెట్టిన కేసులను వెత్తి వేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు మంత్రి నారా లోకేష్‌ను కోరారు. దీనికి కొన్నాళ్ల కిందటే ఆయన ఓకే చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని లోకేష్ తెలిపారు.

Next Story