టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రెడ్ బుక్ పేరిట అధికారులకు హెచ్చరికలు చేస్తున్నారు. ఈ కేసులో లోకేశ్ ను అరెస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టును ఆశ్రయించింది. సీఐడీ పిటిషన్ పై విజయవాడలోని ఏసీబీ కోర్టు నేడు విచారణ చేపట్టింది. వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది. లోకేశ్ 41ఏ నిబంధనలు అతిక్రమించారని, అతడి అరెస్ట్ పై వారెంట్ జారీ చేయాలని సీఐడీ కోరింది. రెడ్ బుక్ అంశంలో లోకేశ్ వ్యాఖ్యలు అధికారులను బెదిరించేలా ఉన్నాయని ఆరోపించింది.
యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ చేతిలో కనిపించిన రెడ్ బుక్ ఇప్పటికీ చర్చనీయాంశంగా మారింది. శంఖారావం సభలో పలుమార్లు లోకేశ్ రెడ్ బుక్ గురించి ప్రస్తావించారు. చట్టాన్ని ఉల్లంఘించిన అధికారుల పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని లోకేష్ అంటున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ లో ఉన్నవారిపై న్యాయ విచారణ చేపడతామని అంటున్నారు. అక్కడితో ఆగని నారా లోకేష్ ఎర్ర బుక్ అంటే వైసీపీ నేతలు ఉచ్చ పోసుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు.