ఏలూరు ఘటనపై స్పందించిన నారా లోకేష్
Nara Lokesh On Eluru Incident. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కొందరు ఉన్నట్లుండి అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపుతోంది.
By Medi Samrat Published on 6 Dec 2020 2:01 PM ISTపశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కొందరు ఉన్నట్లుండి అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపుతోంది. విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్యశాఖ అధకారులు.. ఇంటింటి సర్వే చేస్తున్నారు. అనారోగ్యం బారిన పడ్డ పిల్లల్ని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స ఇస్తున్నారు. ఏలూరు పడమర వీధి పెద్ద అమ్మవారి గుడి ప్రాంతంలో మూర్ఛ వ్యాధితో కళ్ళు తిరిగి కింది పడిపోతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై తెలుగుదేశం నాయకుడు నారా లోకేశ్ స్పందించారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని విమర్శలు గుప్పించారు.
"ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రజలు ఒక్కసారిగా మూర్చ లక్షణాలతో పడిపోయారు. 150 మంది అస్వస్థతకు గురయ్యారు. అందులో అధిక సంఖ్యలో చిన్నారులు ఉన్నారు. వైద్య శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ లేకపోతే.. ఇక రాష్ట్రంలో ఉన్న మిగిలిన ప్రాంతాల పరిస్థితి తలచుకుంటేనే ఆందోళనగా ఉంది.వెంటనే అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలి.చిన్నారుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.కలుషిత తాగునీరు కారణమని ప్రాథమిక సమాచారం.దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి." అంటూ ట్వీట్ చేశారు నారా లోకేష్.
ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రజలు ఒక్కసారిగా మూర్చ లక్షణాలతో పడిపోయారు,150 మంది అస్వస్థతకు గురయ్యారు,అందులో అధిక సంఖ్యలో చిన్నారులు ఉన్నారు.వైద్య శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ లేకపోతే(1/2) pic.twitter.com/foRRQQKdhL
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) December 6, 2020